తెలంగాణ ఏర్పాటుకు అఖిలపక్షమే చివరి సమావేశం కావాలి
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశమే చివరిది కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అఖిలపక్షం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. హన్మకొండలో పర్యాటక శాఖ నిర్మిస్తున్న హరిత హోటల్ నిర్మాణ పనులను మంత్రి ఈ రోజు పరిశీలించారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరి చొప్పున ఆహ్వానం పంపిన విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఇదే చివరి సమావేశం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నెల 21న జరిగే కాకతీయ ఉత్సవాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రారంభిస్తారని చెప్పారు.