తెలంగాణ ఏర్పాటు విఫలప్రయోగంగా చూపేందుకు బాబు కుట్ర
– ప్రత్యేక హైకోర్టు కోసం పోరాడండి
– మావోయిస్టుల ఎజెండా కాదు.. మావోయిస్టులను నిర్మూలించే ఎజెండా
– పోడు భూముల్లో మొక్కలు నాటేందుకే హరిత హారం
– దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు
– బడా పెట్టుబడిదారులకు లక్షా అరవై వేల ఎకరాలు సిద్ధం చేసిండ్రు
– మిషన్ కాకతీయ జలయజ్ఞం లాంటిదే
– రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిబూషన్ ధ్వజం
హైదరాబాద్ ఆగష్టు 23 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫల ప్రయత్నంగా చూపే యత్నం చేస్తున్నారని, హైకోర్టు విభజన కోసం ప్రజలు, లాయర్లు చైతన్యంతో పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ పిలుపునిచ్చారు. దండాకరణ్యలోని ఓ రహస్య ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పోరాడి తమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నారని, కారి ఈ రాష్ట్రంలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావన్నారు. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారుల ఏజెండా మాత్రమే అమలవుతుందన్నారు. ప్రజలు తమ మౌలిక సమస్యల పరిష్కారానికి సబ్బండ వర్గాలు, నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమయ్యేందుకు మా పోరాటంతో కలిసి రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కాకాపోగా, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏజెండాతో హరితహారం పేరుతో ఆదివాసులు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న పోడు భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష ఆరవై ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు పంచేందుకు సర్కార్ సిద్ధపడిందన్నారు. ప్రజలు సాధించుకున్న అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని, అవే భూముల్ని తిరిగి ఎస్సీ కార్పొరేషన్ల పేరుతో కొని భూపంపిణీ కార్యక్రమం చేపట్టడం హస్యాస్పాదంగా మారిందన్నారు. స్మార్టు పోలీస్ కొత్త విధానంతో ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు నిర్బంధాన్ని ప్రయోగించి మూడు ఎన్‌కౌంటర్లు చేశారని,లంకేపల్లి ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు చనిపోయారని, ఆదిలాబాద్‌లో కాల్పులు జరిగాయన్నారు. ఉద్యమ కాలంలో ప్రజలు తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో ఉన్నవారిని, తమ వైపుకు తిప్పికోవడంకోసం బ్రóమింపజేయడం కోసం మావోయిస్టుల ఏజెంయే తమ ఏజండాగా ప్రకటించరన్నారు. నిజానికి మావోయిస్టులను నిర్మూలించే ఏజెండానే టీఆర్‌ఎస్ ఏజెండయని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ జల విధానం గత ప్రభుత్వాలు అనుసరించిన జలయజ్ఞంగా మారిందన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని ఆయన కమీషన్ కాకతీయగా అభివర్ణించారు. కార్పొరేట్ శక్తులను ఊడిగం చేసేందుకు హెలిక్యాప్టర్లలో చక్కర్లు కొడుతూ లక్షఆరవై వేల ఏకరాల భూమిని సేకరించి, నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారన్నారు. ఈ విధానాలన్నీ బడా కార్పొరేట్ శక్తులకే పనికి వస్తాయన్నారు. సమగ్ర సర్వేతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ గ్రామజ్యోతి పేరుతో మీ గ్రామాలను మీరే అభివృద్ధి చేసుకోవానలి చేతులెత్తే శారన్నారు. మౌలిక సమస్యల పరిష్కారం చేతకాని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భక్తి, ఆధ్యాత్మిక చింతన, మూఢవిశ్వాసాల వైపు మళ్లిస్తూ పుష్కరాలు, చిన్నజీయర్ స్వామి, రామేశ్వర్ లాంటి పెట్టుబడిదారుల ద్వారా పాలన సాగిస్తుందన్నారు. సర్వ హక్కుల తెలంగాణ, ప్రత్యామ్యాయ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రజలు పోరాడాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు.