తెలంగాణ ఏర్పాటే మొదటి ప్రాధాన్యం
సిద్దిపేట : తెలంగాణయే తమ మొదటి ప్రాదాన్యమని పీటిఅర్‌యు నేత ఎమ్మేల్సీ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లిలో గల అమరవీరుల స్థూపానికి అయన అదివారం నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు మిగతా ఉపాధ్యాయ సంఘూలతో కలిసి తమ పోరాటం కోనసాగిస్తామని ఉద్యమంలో తమదైన పంథా అనుసరిస్తూ రాష్ట్ర ఏర్పాటుకు పాటుపడతామన్నారు. ఉపాద్యాయులు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారంలో పీఅర్‌టీయూ విశేషకృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఅర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి స్థానికనేతలు సుధాకర్, శ్రీనివాస్‌రెడ్డి నారాయణ్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు.