తెలంగాణ కోసం పోరాటాలు సాగుతున్నయ్‌

కేంద్రం దృష్టిలో ఉన్నాయి
సబిత వ్యవహారంలో జోక్యం చేసుకోం : షిండే
న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) :
రాష్ట్ర ¬ంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగింపు అంశం రాష్టాన్రికి సంబంధించి నదని, ఈ విసయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే సపష్టం చేశారు. పార్లమెంటు లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల దీక్షను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పా రు. అయితే బితా ఇంద్రారెడ్డి వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని షిండే స్పష్టం చేశారు. బుధవారం విూడియా ప్రతినిధుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంపై ఆయన స్పందించారు. సబితా ఇంద్రారెడ్డి వ్యవహారం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని, కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన అన్నారు. ‘విూరు కేంద్రంలో ¬ం మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర ¬ం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును  జగన్‌ ఆస్తుల కేసులో నిందితురాలిగా సిబిఐ చేర్చింది, మీరేమంటార’ని విూడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. దీన్ని బట్టి సబితా ఇంద్రారెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి వదిలేసినట్లు అర్థమవుతోంది. కాగా, తెలంగాణపై ఆందోళనలు సాగుతున్నాయి, తెలంగాణ ఎంపిలు పార్లమెంటులో ఆందోళన చేశారని విూడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే ఆ విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని, తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బుధవారం రాత్రి కాంగ్రెసు ఆంధప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను కలిసే అవకాశం ఉంది. గురువారం ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారు. సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంతో పాటు- ఇతర కళంకిత మంత్రుల వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి అధిష్టానం పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది.