తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

కరీంనగర్‌, జనంసాక్షి: చొప్పదండి గ్రామంలో బుధవారం రాత్రి 12.00గం|| లకు తెలంగాణ కోసం పెరుమాండ్ల నరేష్‌ గౌడ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన మరణంవలనైన తెలంగాణ రావాలని, తన చావే చివరి చావు కావాలని తనలాగా ఇంకెవరు ఆత్మహత్య చేసుకోకూడదని, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ సాధ్యం అవుతుందని, వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి తద్వారా తెలంగాణ సాధించుకోవాలని తన చివరి లేఖలో తెలిపాడు.