తెలంగాణ కోసం మూడురోజుల పాటు పోరు దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : తెలంగాణ సాధన కోసం మూడు రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరు దీక్షలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ తెలిపారు. 9, 10, 11 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టే దీక్షల్లో భాగంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఈ దీక్షలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రకటించడంలో జాప్యం చేస్తున్నందున, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను నిరసిస్తూ పార్లమెంట్‌లో ఈ నెల 5న జరగనున్న చర్చలో తెలంగాణకు చెందిన ఎంపిలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.