తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్ పేర్కొన్నాడు. ప్రభుత్వాలు మారినా. తెలంగాణ బతుకులు మారటం లేదని, తెలంగాణ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ భౌతిక శాస్త్రం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని సరస్వతి కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. మృతుడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చల్లాపూర్ గ్రామం. క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.