తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లోకి…

కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 18 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాను టీడీపీని వీడి, టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కోసం పోరాడాలని కోరుతున్నందునే టీడిపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. బుధవారం స్థానిక ఆర్‌ అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరుతానని చెప్పారు. రాష్ట్రంపై డిసెంబర్‌ 9న కేంద్ర తర్వాత రాష్ట్రాన్ని అడ్డుకున్నది టీడీపీయేనని ఇక్కడి ప్రజలు నమ్మారన్నారు. దీంతో అప్పట్లో తాను పార్టీకి కొనసాగానన్నారు. అయితే, తాము టీడీపీలో ‘జైతెలంగాణ’ అంటే, సీమాంద్ర నాయకులు ‘సమైక్యాంధ్ర’ అని నినాదిస్తున్నారని గుర్తుచేశారు. దీంతో పార్టీలో ఉండి ఉద్యమం చేయాలంటే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. అందువల్లే పార్టీ నుంచి బయటకు రావాల్సి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లుతున్నా తప్ప, ఎవరిపై తనకు కోపం లేదన్నారు. నావంతు బాధ్యతగా ఉద్యమంలో పాల్గొంటానని, రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమం చేస్తామనని పేర్కొన్నారు. దీని కోసం ఈ ప్రాంత ప్రజావూపతి నిధులందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రజావూపతినిధులుందరు కలిసి పోరాడితే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం వస్తుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణరావు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఒత్తిడి పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు తనకు 5ఏళ్ల కాలానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, వారి అభివూపాయాలకు అనుగుణంగానే పార్టీ మారుతున్నానని, అలాంటప్పుడు తాను ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాలన్నారు. ఈ ప్రాంతం ప్రజలు కోరితే, రాజీనామా చేస్తానన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుగ్గిళ్ల రమేష్‌, ప్రేంకుమార్‌, మంద రాజమల్లు , శ్రీధర్‌, గంగారెడ్డి, సుధాకర్‌, గందె మల్లారావు తదితరులు పాల్గొన్నారు.