తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ.

ఈనెల 9,10 తేదీలలో ఉప్పల్ పిర్ధాజిగూడ లో జరుగు గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయమహాసభలను జయప్రదం చేయాలని గీత పనివారల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి మండలంలోని మల్లికార్జున్ నగర్ సిపిఐ కార్యాలయం లో రాష్ట్ర మహాసభల గోడ పత్రికలనుఆవిష్కరించారు.అనంతరం  ఆయన మాట్లాడుతూ.గీతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం 65 సంవత్సరాల నుండి పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు.గీసే వాడికే చెట్టు అన్న నినాదంతో  ముందుకెళ్లాలని ఉద్యమాలను నడిపించి కార్మికుల హక్కులను సాధించడం జరిగిందని తెలిపారు.గీత కార్మికుల కోసం సంక్షేమ నిధిఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలని,  మెడికల్ బోర్డును రద్దుచేసి పాత పద్ధతి ప్రకారమే మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఎక్స్ గ్రేషియాను పది లక్షలు పెంచాలని ప్రతి సొసైటీకి ఈత వనం పెంపకానికి 5 ఎకరాల భూమి, అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సాయి గౌడ్,నిరంజన్ గౌడ్,యాదగిరి, రాములు,లింగం,వెంకటేష్,భూమయ్య, నందు తదితరులు పాల్గొన్నారు.