తెలంగాణ గ్రామ క్రీడాప్రాంగణం పై భూస్వామి డేగ కన్ను…

-ఆ భూస్వామి పలుకుబడి అంతా ఇంతా కాదు…
-అధికారులను మచ్చిక చేసుకుంటూ గ్రామ సర్పంచ్ కార్యదర్శుల పై ఒత్తిడి…
-అధికారుల అండదండలతో కోనోకార్పస్ మొక్కలు  నాటిస్తున్న భూస్వామి…..
-గ్రామంలోని భూమిని ఆక్రమించడానికి  గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైనం….
-గ్రామ సర్పంచ్ కార్యదర్శుల పై ఒత్తిడి చేస్తున్న అధికారులు….
-గ్రామకంఠం భూమి భూస్వామి పాలెనా…?
ములుగు బ్యూరో,జూన్21(జనంసాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అంగరంగవైభవంగా జూన్ 2వ తేదీన ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామ క్రీడాప్రాంగణం కు సంబంధించిన గ్రామకంఠం భూమి పై  అధికారుల ద్వారా ఒత్తిడి
చేపిస్తున్న వ్యక్తి,అధికారుల ద్వారా ఇబ్బందులకు గురి అవుతున్న గ్రామ సర్పంచ్, కార్యదర్శి గ్రామంలోని పలు అభివృద్ధి లతో ముందుకు పోతున్న గ్రామ సర్పంచ్ కార్యదర్శి కి తప్పని తిప్పలు,గ్రామ పంచాయతీ తీర్మానాలను లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు చేస్తున్న వైనం, ఆ భూస్వామి అధికారులను మచ్చిక చేసుకుంటూ గ్రామ సర్పంచ్,గ్రామ కార్యదర్శి లపై ఒత్తిడి తీసుకువస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు,గ్రామంలోనీ యువత కు, గ్రామ ప్రజల ఉపయోగం కోసం చేసే పనులకు అడ్డుపడుతూ గ్రామ పంచాయతీ తీర్మానం లేక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న భూస్వామి, అధికారులను మచ్చిక చేసుకుని గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శలకు గ్రామ అభివృద్ధికి పాటుపడక పోవడమే కాక తెలంగాణ క్రీడాప్రాంగణం పై కన్నేసిన భూస్వామి,తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యా ప్తంగా నిషేధించిన కోనోకార్పస్ మొక్కలను ఇక నుంచి గ్రామాలలో పెంచొద్దని ఆదేశిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ ఈనెల 15న ఉత్తర్వులు జారీచేశారు.ములుగు జిల్లా నల్లగుంట గ్రామం లో ఏర్పాటు చేసిన తెలంగాణ  క్రీడా ప్రాంగణం లో నిషేధించిన కోనోకార్పస్ మొక్కలు నాటిస్తున్న భూస్వామి,అధికారుల అండదండలతో తెలంగాణ ప్రభుత్వం అంగరంగవైభవంగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం లో ఈ మొక్కలు నాటడం గమనార్హం.అధికారులు ప్రజల బాగోగులు చూడాల్సింది పోయి,గ్రామ కట్టుబడులను పక్కకు పెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.అధికారులు గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామ యువత కు గ్రామ ప్రజల కు మేలు చేసే పనులలో పాలుపంచుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.