తెలంగాణ చరిత్ర ప్రధానాంశంగా సెలబస్
– విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్, ఆగష్టు 31 (జనంసాక్షి):
గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్స్ నూతన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆచార్య హరగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. నెల రోజులపాటు అధ్యాపకులు, ఆచార్యులను సంప్రదించి ఈ సిలబస్‌ను రూపొందించినట్లు చెప్పారు. సిలబస్‌లో గ్రూప్ 1,2,3,4 సహా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ విభాగాలకు సిలబస్ పూర్తిస్థాయిలో తయారుచేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో సిలబస్‌ను రూపొందించినట్లు చెప్పారు. అన్ని సిలబస్‌లను తక్షణమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు. 90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని సిలబస్ విడుదల సందర్భంగా చక్రపాణి తెలిపారు. విఇధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే సిలబస్ కమిటీలో ఉండం విశేషమన్నారు. వారిని ఈ సందర్భంగా ఆయన అబినందించారు. జులై 27న ప్రభుత్వం స్కీంను ఆమోదించిందిని వెల్లడించారు. గ్రూప్స్ 1, 2, 3, 4తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం రూపొందించిన సిలబస్ తక్షణం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు. సిలబస్ రూపొందించిన మేధావులకు, ప్రొఫేసర్లకు ధన్యవాదాలు. సిలబస్ కమిటీలో ఉన్న 32 మంది సభ్యులకు టీఎస్‌పీఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర పొందుపర్చామన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా సిలబస్ రూపొందించామని ఆచార్య హరగోపాల్ అన్నారు. ఎంతో కమిట్‌మెంట్‌తో దీనిని చేపట్టామన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి: హరగోపాల్
విద్యార్థులు కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. అందరూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆచార్య హరగోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆయన తెలంగాణ గ్రూప్స్ సిలబస్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. కమిటీ సభ్యులంతా ఎంతో నిబద్ధతతో సిలబస్ తయారు చేశారన్నారు. తెలంగాణ సాధించుకున్న తీరు, చరిత్ర సిలబస్‌లో పొందుపరిచినట్లు చెప్పారు.