తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి);
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. యంపి బిబీ పాటిల్, జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, జడ్ పి చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, యస్పి బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈసందర్భంగా సభాపతి పోచారం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్పీకర్ పోచారం తన సందేశంలోరాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశానికి ఆగస్టు 15, 1947 న వచ్చింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో 584 సంస్థానాలు ఉన్నాయి.మన తెలంగాణ ప్రాంతాన్ని నిజాం వంశస్థులు పరిపాలించారు.దేశ ప్రధాని నెహ్రూ సూచనపై నాటి దేశ హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ వచ్చి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారు.తెలంగాణ తో పాటుగా, మహారాష్ట్ర, కర్ణాటక లోని ప్రాంతాలకు మాత్రం సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్య్రం వచ్చింది.ఇటీవలే భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ ఇది కేవలం ఒక కులానికో మతానికో సంబంధించినది కాదు.నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు.పరిపాలన సజావుగా జరగాలంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరం అని రాజ్యాంగంలో పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం అయిన గొప్ప వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ మనందరికి ఆరాధ్య దేవం అంబేడ్కర్ అంబేడ్కర్ మన దేశంలో పుట్టడం మన అదృష్టం.కుల మతాలకు అతీతంగా అందరం అంబేద్కర్ గారి మార్గదర్శకంలో కొనసాగాలి.తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ కు రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టుకుని వారిని గౌరవించుకున్నాం.
భారత పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశాం.రాజకీయాలు కలుషితం అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజాసేవలో పోటీ పడాలి.ఆసరా పెన్షన్లతో వృద్ధులకు విలువ పెరిగింది.దేశంలో ఆసరా పెన్షన్లను అత్యధికంగా ఇస్తూ పేదలను ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ.
ఈమధ్యనే నూతనంగా మరో 10 లక్షల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.మిగతా రాష్ట్రాలలో రూ. 500, రూ.1000 అందిస్తే మన దగ్గర రూ. 2000, రూ. 3000 అందిస్తున్నం.
45 లక్షల మందికి ఆసరా పెన్షన్ ల ద్వారా రూ. 15,000 కోట్లు అందిస్తున్నాం.పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు.కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది.నేను రైతునే
గతంలో వానాకాలం వచ్చిందంటే పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చేవారు.ఇలాంటి బాధల నుంచి పుట్టిందే రైతుబంధు పథకం.ఈరోజు రాష్ట్రంలో 69.80 లక్షల మంది రైతులకు 1.50 కోట్ల ఎకరాలకు సంవత్సరానికి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఏటా రూ. 15,000 కోట్లు అందిస్తున్నారు.ఇప్పటి వరకు అరవై వేల కోట్ల రూపాయలు రైతుబంధు ద్వారా రైతులకు అందించారు.దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతుబంధు పథకం ద్వారా వారం రోజులలోనే ఆ కుటుంబ బ్యాంకు ఖాతాలో అయిదు లక్షల రూపాయలు జమ చేస్తున్నాం.పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్ధిక సహాయం అందించడానికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.గత మార్చి వరకు పదమూడు లక్షల మంది లబ్ధిదారులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందించాం.కేసీఆర్ కిట్ అందిస్తున్నాం.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నం.నిన్ననే నీతిఆయోగ్ బృందం హుజురాబాద్ లో పర్యటించి దళితబంధు పథకం లబ్ధిదారులను కలిసింది.దళితబంధు పథకంతో తాము ఆర్ధికంగా లాభం పొందుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. ఇది మంచి పథకం అని నీతిఆయోగ్ సభ్యులు కూడా ప్రశంసించారు.ఇది గర్వకారణం ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయాలంటే అధికార యంత్రాంగం తోడ్పాటు అవసరం జిల్లా యంత్రాంగాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న కలెక్టర్ గారికి, ఉద్యోగులు అందరికీ అభినందనలు.అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలంటే శాంతిభద్రతలు అవసరం. కామారెడ్డి జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రం భాగా అభివృద్ధి చెందింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో బాన్సువాడ పట్టణంలో మౌళిక సౌకర్యాలు మెరుగుపరిచాం అన్నారు.