తెలంగాణ డీఎంఈ గా డాక్టర్ రమణి
హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జీగా డాక్టర్ రమణికి పోస్టింగ్ ఇస్తూ సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చందా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రమణి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. మే 31 వరకు తెలంగాణ డీఎంఈగా పుట్టా శ్రీనివాస్ విధులు నిర్వర్తించారు. మే 31న ఆయన పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ ఆధారంగా రమణికి ఇన్‌ఛార్జీ డీఎంఈగా పోస్టింగ్ ఇచ్చారు.