తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస ఆందోళన

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళన దిగారు. తెలంగాణ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస పభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మరోవైపు బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభుల్యలు ఆందోళన చేపట్టారు.