తెలంగాణ ప్రజలకు కడియం పండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆ ఫలాలు అందుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు మంత్రి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండగ ప్రజల జీవితాలను భోగ భాగ్యాలతో నింపాలని, సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు, రైతును రాజు చేసేందుకు,సీఎం కేసీఆర్‌ కు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని..ఇలాంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. భోగి, సంక్రాంతి, కనుమలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కడియం శ్రీహరి ఆకాంక్షించారు.