తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న నేతల అరెస్టు

కోండపాక, మెదక్‌ : తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న పలువురు తెరాస నేతలను పోలిసులు అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మండలసార్టీ అధ్యక్షుడు రాగల దుర్గయ్య, ఇతర ముఖ్య నేతలు లక్ష్మారెడ్డి ఎల్లంయాదవ్‌, నోనెకుమార్‌ తదితరులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్నవారిని విడిచివెట్టాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికి పోలిసులు అరెస్టులను కోనసాగిస్తున్నారని నేతలు మండిపడ్డారు.