తెలంగాణ మార్చ్‌ విజయవంతంతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి: కొదండరాం

కరీంనగర్‌:(టౌన్‌)  కరీంనగర్‌లో జేఏసీ చైర్మన్‌ కొదాండరాం మాట్లాడుతూ వచ్చిన తెలంగాణ ప్రకటనను ఆధ్ర నాయకులు అడ్డుకున్నారని. తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకుల మౌనం వల్లనే తెలంగాణ ప్రకటన వెనక్కి పోయిందని, ఇదే ఆకరి పోరాటమని  సెప్టెంబర్‌ 30వ తేదినా తెలంగాణ మార్చ్‌ విజయవంతంతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కొంతమంది ప్రజా ప్రతినిధులు ఆంధ్ర పాలకులకు తొత్తులయి మేకవన్నె పులులవల్లే ప్రకటనలిస్తూన్నారని అన్నారు. ఆంధ్ర పాలకుల దుశ్చర్యలకు తెలంగాణ ఉద్యమం దెబ్బతినేలా తెలంగాణ ద్రోహుల ప్రయత్నం విఫలం చెందేవిదంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో కరీంనగర్‌ కవాతును సెపెంబర్‌ 16ను విజయవంతం చేయాలని, సెప్టెంబర్‌ 30 తెలంగాణ మార్చ్‌కు ఎగిసి పడుతున్న అలల్లాగా హైదరాబాద్‌ దిగ్బందం చేయాలని ప్రతి ఇంటి నుండి తెలంగాణ ఉద్యమ కారులు తెలంగాణ మార్చ్‌కు నడుంకట్టి బయలు దేరాలని జేఏసీ చైర్మన్‌ కొదాండరాం పిలుపు నిచ్చారు.