తెలంగాణ ముస్లిం సాహిత్యం

ముస్లింలకు తెలంగాణ అత్యవసరం

కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో

పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో…

అంటారు. తెలంగాణ ముస్లింల పరిస్థితి ఇలాగే ఉంది. మా నుంచి మా భాషను దూరం చేశారు. ముస్లింలు తెలుగులో కవిత్వం రాస్తూ అవసరమైన చోట ఉర్దూ పదాలు వాడితే టైటిల్‌ ఉర్దూలో పెడితే ఆంధ్రావాళ్లు తెలంగాణ ముస్లిం కవుల మీద విమర్శలు చేశారు. ఉర్దూ పదాలు వాడే బదులు ఉర్దూలోనే కవిత్వం రాయవచ్చు కదా అని అపహాస్యం చేశారు. వాళ్లు మాత్రం తమ కవిత్వంలో ఇంగ్లీషు పదాలు విరివిగా వాడతారు. ఉర్దూ విషయంలో మాత్రం ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతందంటే వాళ్లకు ఉర్దూ మీద ఏ మాత్రం ప్రేమ లేదు. తెలంగాణ వారికి ఉన్న ప్రేమ ఆంధ్రావారికి ఉండదు అని ఈ విషయంలో అర్థమయ్యింది.

నిజాం రాజుల కాలంలో ఉర్దూ రాజభాషగా ఉండేది. దాంతో ఇక్క డివాళ్లంతా ఉర్దూలో చదువుకున్నారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇండి యన్‌ యూనియన్‌లో బలవంతంగా కలుపుకున్నాక ఇక్కడి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండానే రాజభాషగా ఉర్దూను రద్దు చేసి తెలుగును ప్రవేశపెట్టారు. కొన్నాళ్ల సమయమిచ్చి తెలుగు గానీ, ఇంగ్లీషుగానీ నేర్చుకోవాలని ఆంక్షలు పెట్టారు. చుట్టూ ఉన్న ఉర్దూ వాతావరణంలోంచి ఒక్కసారిగా ఇతర భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత నుంచి తెలుగు మీడియం స్టార్ట్‌ అయ్యింది. అప్పటివరకు ఉర్దూ చదువుకుని ఉన్న వాళ్లందరూ ఏమయ్యారో ఏ లెక్కలూ మనకు చెప్పవు. వాళ్లంతా చిల్లర వ్యాపారాలు చేసుకునే దుస్థితికి నెట్టబడ్డారు. రిక్షాలు తోక్కే పరిస్థితి కల్పించారు.

నేటి తరాలు ఇంట్లో ఉర్దూ మాతృభాషగా మాట్లాడుతున్నప్పటికీ ఉర్దూలో చదివే అవకాశాలు లేక తెలుగులోనే చదువుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ దేశంలోనే ప్రసిద్ద పొందిన ఉర్దూ కవులు, రచయితలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్నారు. వారికి ఆంధ్రా వలస పాలకులు ఏ మాత్రం గౌరవమిచ్చింది లేదు. వారు వేరోక లోకంగా బతకాల్సి వస్తున్నది. నిజాంలా కాలంలో భాదత ఉపఖండంలోనే ఉర్దూ కవులు, రచయితలకు హైదరాబాద్‌ రాజ్యం ప్రసిద్ది పొందింది. వారిని ఎంతో ఆదరించింది.

200 ఏళ్లు నిజాంల పాలనలో ఉండడం వల్ల రాజభాషగా ఉర్దూ ఉండడంతో ఇక్కడి తెలుగు డిఫరెంట్‌ యాక్సెంట్‌ను తీసు కుంది. వేల ఉర్దూ పదాలు తెలుగైజ్‌ అయ్యాయి. తెలుగు ఉర్దూ మిక్స్‌డ్‌ లాంగ్వేజ్‌లో ఇ్కడివాళ్లు మాట్లాడుకోవడం చూస్తాం. ఆ మిక్స్‌ డ్‌ భాష ఇక్కడివారి జీవితంలో భాగమైంది. నిజానికి తీయని ఉర్దూ సమ్మిళిత తెలుగు వల్ల ఇక్కడి తెలుగువారికి ముస్లింలపై, ముస్లిం లకు తెలుగువారిపై ఆప్రకటిత ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అంటే సమ్మిళిత భాష అనేది హిందూ ముస్లింల మధ్య సహజీవనానికి తోడ్పడింది. తెలంగాణ ఏర్పడడం వలన మళ్లీ ఆ వాతావరణం వస్తుందని మేం ఆశిస్తున్నాం. ఆంధ్రావారి ఉర్దూ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత నుంచి తెలంఆణ ముస్లింలు తప్పించుకోగలుగుతారు. జనాభా పరంగా తెలంగాణలో ముస్లింల శౄతం ఎక్కువ. కానీ స్థాని క ఉద్యోగాలు ఇక్కడి ముస్లింలకు దక్కకుండా పోయాయి. ఇవాళ ముస్లింలకు ఏమైనా ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే కేవలం పోర్త్‌ క్లాస్‌ ఉద్యోగాలే. అవి కూడా చాలా తక్కువ. అందుకే చాలమంది. ముస్లింలు భార్యపిల్లల్ని వదిలి దేశం కానీ దేశాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింల బాగోగుల గురించి ఆంధ్రా వలస ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు.

తెలంగాణలోని ముస్లింలంతా తెలంగాణ కోరుతున్నారు. ఒక్క హైద రాబాద్‌ పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. తెలంగాణ ముస్లింలకు ఎంఐఎం ప్రతినిధి కాదు. ప్రతినిధిగా మాట్లాడడాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. వారు తెలంగాణ మీద ప్రేమ లేకండా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఎంఐఎం వల్ల పాతబస్తీ ముస్లింలకు ఒరిగిందేమి లేదు. వారిని గరీబుల్లాగే ఉంచి, నిరక్షరాస్యులుగానే ఉంచి తమకు  తమ పబ్బం గడుపుకంటున్నారనే విషయం అంద రికీ తెలిసిందే. ఆంధ్రావారు వచ్చాకే హైదరాబాద్‌లో మత ఘర్ష ణలు జరిగాయి. అంతకు ముందు వందల ఏళ్లుగా తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి  సహజీవనం కొనసాగిస్తున్నారు. ఆధ్రా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులను మార్చడానికి హైద రాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించిన చరిత్ర తెలసిందే. తెలంగా ణలోని తెలుగువారికీ, ముస్లింలకు మధ్య సహజీవనం పెంపోందిం చుకోవాలన్నా వీలైనంత త్వరగా ఆంధ్రావారి నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం అవసరం.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయా ల్సిన  సందర్భంలో ఈ సంచికను తెస్తున్నం. విస్మరణకు గురయిన ముస్లింల చరిత్రను, సాంస్కృతిక చిహ్నాలను అనేక ఉద్యమాల్లో ము స్లిం  పాత్రను వెలుగులోకి తెస్తున్న ఈ సంచిక ముస్లింలందరిలో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నం. శతాబ్దాలుగా తెలుగువా రిలో సహజీవనం చేస్తున్న ముస్లింలందరూ ఆ గతాన్ని ఈ సంచిక ద్వారా గుర్తుకు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మూకుమ్మడిగా పాల్గొనాలని ఆశిస్తున్నం.

కాఫిర్‌ను కాను! అవిశ్వాసిని: ఎం.టీ.ఖాన్‌

సాహిత్యకారులకు, సామాజిక పౌరహక్కుల  ఉద్యమకారులకు ఆయన ఖాన్‌ సాబ్‌ ! పాతబస్తీవాసులకు ఆయన బడే భాయి ! ఇటు తెలుగు, అటు ఉర్దూ సాహిత్యాన్ని ఎరిగినవారు. ఉద్యమాలతో నడిచినవారు. ఆయన విలువైన అనుభవసారం ఆయన మాటల్లోనే…

నాన్న బద్రోద్దీన్‌ కాంగ్రెస్‌ కార్యకర్త రజాకార్ల పాలిటిక్స్‌ని వ్యతిరే కించాడు.

పాతబస్తీలో మా ఇరుగుపోరుగు అంతా దళితులే. బాగా కలిసిపో యేవాళ్లం.  నేను పుట్టిన తరువాత మా అమ్మకు పిచ్చెక్కింది. అప్పు డు ఆమె నాకు పాలు ఇచ్చే స్థితిలో కూడా లేదట. ఆ సమయంలో నాకు ఒక మాదిగామే పాలు ఇచ్చేదట. అందుకే నావన్నీ మాదిగ బుద్ధులని మా చుట్టాలంటూంటారు. మత సాహిత్యానికి ముస్లిం సామాజిక సాహిత్యానికి మద్య ఎప్పటికైనా విభజన రావాల్సిందే. అది ఎప్పుడో జరగాల్సిన పరిణామం. ఇప్పుడు జరిగింది అంతే. మ త ప్రాతిపదికన సాహిత్యం ఏర్పడడం మంచిది కాదు. ఎందుకంటే మతం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. తెలంగాణ సాయుధ పో రాటంలో నన్ను ఆకట్టుకున్న అంశం హిందూ- ముస్లిం ఐక్యత. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం హిందూ-ముస్లింలు కలి సి పనిచేశారు. వీళ్ల ఐక్యతకు బందగీ లాంటి వాళ్లు ప్రతీక.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ మత కోణంనుంచి చూసే ప్రయత్నం చేస్తుంది.

పోలిస్‌ యాక్షన్‌ తరువాత హైదరాబాద్‌ ముస్లిం జీవితాలను చీకటి కమ్మేసింది. 60 శాతం మంది ముస్లింలు ఉద్యోగాలు కోల్పో యారు. నిజాం ఆర్మి రద్దయిన తరువాత దాంట్లో పని చేసే పదివే లకు పైగా ముస్లింలు నిరుద్యోగులయ్యారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతికారు. దాంతో పాతబస్తి అనగానే అంద రూ సమస్యాత్మక ప్రాంతం అనే అభిప్రాయం వచ్చేసింది. ఆర్థికంగా ఉన్నవాళ్లు బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌కు తరలిపోయారు. కేవలం పేదవాళ్లు మాత్రమే మిగిలిపోయారు.ఇక రాజకీయ పార్టీలు, పాత బస్తి పేదరికాన్ని దూరం చేయడం కంటే తమ రాజకీయాలకే ప్రాధా న్యత ఇచ్చాయి. దీంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న ట్లుగా తయారైంది.

ఇంటర్వ్యూ: యాకూబ్‌ పాషా

ఇంకావుంది…