తెలంగాణ మెడిసిన్‌ ఫలితాల విడుదల

5

హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):  తెలంగాణ మెడికల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 9ననిర్వహించిన ఎంసెట్‌ 2 ఫలితాలను బుధవారం విడుదల చేశారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలను సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 50,961 మంది పరీక్షకు హాజరయ్యారు. 47,644 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఎంసెట్‌ కన్వీనర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 30,31 తేదీల్లో వికలాంగుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఆగష్టు మొదటి వారం నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.. ఎంసెట్‌-2 పరీక్ష ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశ పరీక్షలో 90.76 శాతం హాజరు నమోదైంది. 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,961 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం వెబ్‌ సైట్‌ లో చూసుకోవచ్చు. విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వి రమాణారావు ఉన్నారు.

టాప్‌టెన్‌ ర్యాంకర్స్‌..

ఫస్ట్‌ ర్యాంకు – ఉజ్వల్‌, 97.66 శాతం మార్కులు(హైదరాబాద్‌)

రెండో ర్యాంకు – ఐశ్వర్య, 97.66 శాతం మార్కులు(మెదక్‌)

మూడో ర్యాంకు – సాయి సుశృత, 97.61 శాతం మార్కులు(కర్నూలు)

నాలుగో ర్యాంకు – వేణు మాధవ్‌, 97.53 శాతం మార్కులు(హైదరాబాద్‌)

ఐదో ర్యాంకు – అంకిత్‌ రెడ్డి, 97.36 శాతం మార్కులు(హైదరాబాద్‌)

ఆరో ర్యాంకు – ప్రణవి, 97.19 శాతం మార్కులు(మహబూబ్‌నగర్‌)

ఏడో ర్యాంకు – తేజస్విని, 97.19 శాతం మార్కులు(అనంతపురం)

ఎనిమిదో ర్యాంకు – సిద్ధార్థ్‌ రావు, 97.02 శాతం మార్కులు(హైదరాబాద్‌)

తొమ్మిదో ర్యాంకు – వినీత్‌ రెడ్డి, 96.98 శాతం మార్కులు(హైదరాబాద్‌)

పదో ర్యాంకు – కృష్ణగీత్‌, 96.90 శాతం మార్కులు(ఖమ్మం)