*తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆరిది ఎమ్మెల్యే*

చిలుకూరు సెప్టెంబర్ 21(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ ఆసరాగా నిలుస్తోందని కోదాడ,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.  చిలుకూరు మండలంలోని చెన్నారిగూడెం గ్రామంలో ఆసరా పింఛన్ల కార్డులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 ఏండ్లకు తగ్గించారని అన్నారు. తద్వారా అనేక మంది లబ్ధిపొందుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షనర్లతో కలిపి 46 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లను అందిస్తోందన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.  పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.  ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన సీఎం కేసీఆర్ రుణపడి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం ఆయా గ్రామాలలోని ఎమ్మెల్యే  అభివృద్ధి నిధుల నుండి 4 లక్షల వ్యయంతో సిసి రోడ్లకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు  శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ కమతం కొండలు, మండల సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టపాక పంతులు పిఎసిఎస్ చైర్మన్ సైదులు, మాజీ సర్పంచ్ గంట శ్రీనివాసరావు, కార్యదర్శి పూల శ్రీనివాసరావు ఎంపీడీవో ఈదయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.