తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే తెలంగాణ విముక్తి,విలీనం

   సిపిఐ

వనపర్తి:సెప్టెంబర్ 14 (జనం సాక్షి) వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నుంచి తెలంగాణ విముక్తమై, భారత దేశంలో విలీనమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కే శ్రీరామ్ భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ అన్నారు. బుధవారం కేతేపల్లి లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ నగర్ లో సిపిఐ మండల కార్యదర్శి డంగు
కురుమయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిజాం పాలనలో బాంచన్ దొర నీ కాల్మొక్త అని బానిసత్వంతో బతికే పేద ప్రజలలో చైతన్యం నింపి ఎర్రజెండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిందన్నారు నిజాం అండతో గ్రామాల్లో ప్రజల మాన ధన ప్రాణాలను దోచిన రజాకర్ల సైన్యం ,దొరలు ,భూస్వాముల భరతం పట్టిందన్నారు 3000 గ్రామాలను విముక్తం చేసి ఎర్రజెండాలను పాతిందన్నారు పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ప్రత్యేక చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దే అన్నారు 4500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఈ పోరాటంలో అమరులయ్యారన్నారు.ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య నేలకొరిగి తొలి అమరుడు అయ్యాడన్నారు.భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సువర్ణ అక్షరా లతో లిఖించదగిందన్నారు.కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి,మగ్దూం మొయినుద్దీన్,బద్దం ఎల్లారెడ్డి తదితరుల నాయకత్వంలో పోరాటం సాగిందన్నారు తన భూమి ధాన్యాన్ని లాక్కున్న దొర విసునూరు రామచంద్రారెడ్డి పై చాకలి ఐలమ్మ తిరగబడి పోరాడింద న్నారు తన కుటుంబం నాశనమైన తాను జైలు పాలైన తగ్గలేదన్నారు గ్రామాల్లో ప్రజలు కారం మూటలు,గుత్పలు ,ఒడిసెల,గుణపం బాకు,బల్లెం,దొరికిన ప్రతిదీ ఆయుధమైందన్నారు.దీంతో భూస్వాములు ఊళ్లను విడిచి పారిపోయి నిజాం శరణు జొచ్చారన్నారు.నరరూప రాక్షసుడు ఖాసిం రాజ్వి నాయకత్వంలో నిజాం సైన్యం ఊర్ల పైబడి ప్రజలను కమ్యూనిస్టులను హింసలు పెట్టారన్నారు మహిళలను మానభంగం చేసి వివస్త్ర లను చేసి బతుకమ్మ పాడించారన్నారు నిజాం దాస్టికంపై వార్తలు రాసిన జర్నలిస్ట్ స్వయబుల్లాఖాన్ చంపారన్నారు మగ్దుం మొయినుద్దీన్ నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించారన్నరు.వీరు మైనార్టీలను గుర్తు చేశారు అందువల్ల ఇది హిందూ ముస్లిం పోరాటం ఎంత మాత్రం కాదన్నారు రాజకీయ లబ్ధి కోసం కొందరు అలా చిత్రించే ప్రయత్నం చేయటం హీనమన్నారు బిజెపికి,తెలంగాణ విముక్తి కీ ఎటువంటి సంబంధం లేదన్నారు.విమోచన దినం పేరుతో బిజెపి హడావిడి చేయటం నీచమన్నారు. మైనార్టీలకు దూరం కారాదన్న రాజకీయ ఉద్దేశంతో కేసీఆర్ దీన్ని జాతీయ సమైక్యత దినంగా జరపాలంటున్నారన్నారు ఏదేమైనా కమ్యూనిస్టుల పోరాటాల వల్ల తెలంగాణ ప్రాంతం వారి ఆధీనంలోకి రావటం చూసి ఆనాటి దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ గొప్పదనం కమ్యూనిస్టులకు దక్కరాదన్న దురుద్దేశంతో తెలంగాణలో సైనిక చర్య చేపట్టారన్నారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లనే తెలంగాణ నిజాం నుండి విముక్తమై భారత దేశంలో సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో విలీనమైందన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో గ్రామాలు వదిలి పారిపోయిన భూస్వాములు దొరలు దేశ్ముఖులు కాంగ్రెస్ నాయకుల పేరుతో తిరిగి గ్రామాలకు చేరుకుని పంచిన భూములను పేదల నుంచి లాక్కున్నారన్నారు.దీంతో మళ్లీ పేదలపై అణచివేత మొదలైంద న్నారు.అయితే ఆనాటి పోరాటయోధుల త్యాగాలను స్మరించుకొని వారి పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం పాలకులపై పోరాడాలన్నారు .ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డంగు కుర్మయ్య,శాఖ కార్యదర్శి ఆంజనేయులు,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్,సీనియర్ నాయకులు కాకం చిన్న నారాయణ,వార్డు నెంబర్ పెంటయ్య,కురువ హనుమంతు,బోయ చిన్న కురుమయ్య,మాల కుర్మయ్య, హుస్సేన్,రామాంజనేయులు,రాముడు ,అలివేలు,చెన్నయ్య,కాకం బాలయ్య,మద్దిలేటి, కురువ పెంటయ్య,తదితరులు పాల్గొన్నారు.
Attachments area