తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలని నాంపల్లి చంద్రమౌళి

తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభ నల్లగొండలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27న నల్గొండ లో మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. 1936లో ఏర్పడిన అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉద్యమ వారసత్వాన్ని పునుగు పుచ్చుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరే కంగా జమీందారీ జాకీర్దారులకు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది రైతు సంఘం పేర్కొన్నారు. నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమశీలంగా పోరాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకంగా సుదీర్ఘం పోరాటం చేసి విజయం సాధించిందనిన్నారు.పీఎం ప్రణామ్ పథకాన్ని రద్దు చేయాలని ప్రధానమంత్రి కిసాన్ సమన్ పథకానికి 6000 నుండి 18 వేల వరకు పెంచాలని పాలు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీ రద్దు చేయాలని లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తుందని, కోటి 70 లక్షల మంది సభ్యులతో దేశంలోని అత్యధిక పెద్ద సంఘంగా అఖిల భారత కిసాన్ సభ ఉంది రాష్ట్రంలోనూ ఐదు లక్షల మంది సభ్యులతో రహితంగా ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం నికరంగా పోరాటం చేస్తుందన్నారు.నవంబర్ 27,28,29 తేదీలలో జరిగే రాష్ట్ర మహాసభలను ప్రతినిధులు పాల్గొని, భవిష్యత్ కర్తవ్యాలు గత కార్యక్రమాలను సమీక్ష ఉంచుకొని ఉద్యమానికి సిద్ధం కావడానికి సంసిద్ధమవుతున్నారానిన్నారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వాష్పాక ముత్తిలింగం, రైస్ సంఘం నాయకులు మలిగిరెడ్డి దశరథ్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, పల్లెటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు