తెలంగాణ వచ్చేదాక వత్తిడి ఉండాల్సిందే : కె. కేశవరావు
హైదరాబాద్: గత అనుభవారి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు అధిష్టానంపై ఒత్తిడి ఉండాల్సిందే నని టీ కాంగ్రెస్ సీనియర్ నేత కే. కేశవరావు స్పష్టం చేశారు. ఈ సాయంత్రం కేకే నివాసంలో తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది. జనవరి 4న టీ కాంగ్రెస్ మంత్రులతో ఐక్యత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఐక్యతా భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పై ఒత్తిడి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐక్యతా సమావేశంలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఆందోళన ఎవరు చేసిన మద్దతు తెలుపుతామన్నారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన వివక్షకు సిగ్గుపడుతున్నాని ఆవేధన వ్యక్తం చేశారు.