తెలంగాణ వల్లనే మెదక్‌ను జిల్లా చేసుకోగలిగాం
24 గంటల కరెంట్‌తో అభివృద్దిని సాదించాం
అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్ గెలవాలి
మెదక్‌లో పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
కాళేశ్వరంతో నీటి సమస్య తీరుందన్న కెసిఆర్
మెదక్ ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన సిఎం కెసిఆర్
మెదక్,నవంబర్21(జనంసాక్షి): మెదక్‌ను జిల్లా చేస్తానన్న వాగ్దానం నిలుపుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడకున్నా, తాము అధికారంలోకి రాకున్నా ఈ కల నెరవేరేది కాదన్నారు. మెదక్ ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తూ.. తాను ఈ మట్టి బిడ్డనేనని. ఇక్కడ జరుగుతున్న పనులు నాకన్నా విూరే బాగా చర్చించుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనేక కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తున్న ఘతన ఆమెదన్నారు. ఆమె తనకు కూడా బిడ్డని అన్నారు. ఆమెను గెలపించి అభివృద్దికి పట్టం కట్టాలన్నారు. ఇంకా మాట్లాడుతూ…
తెలంగాణ సాధిస్తామన్న నాడు ఎవరూ నమ్మలేదు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరం లేదని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ తర్వాత పూర్తి కాబోతుంది. కాళేశ్వరం నీళ్లతో మంజీరా, హల్దీవాగు ఎండిపోకుండా కాపాడుకోగలుగుతాం అన్నారు. రెప్పపాటు కూడా పోకుండా నిరంతరం కరెంట్ ఇస్తున్నం. రైతులందరికీ గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. మెదక్ అభివృద్ధి పనులు చేయించే బాధ్యత నాది. జిల్లా ఏర్పాటు కారణంగా మెదక్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు వస్తాయి. అలాగే అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందేలా కార్యక్రమం రూపొందిస్తం. రాష్ట్రంలో అదనంగా కోటి 20 లక్షల గొర్రెలు తయారైనయి. క్రమశిక్షణతో పనిచేసి సంపద పెంచుతున్నం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక విూద వచ్చిన ఆదాయం రూ.9 కోట్ల 56 లక్షలు. ఇసుక విూద రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం రూ.2వేల 57 కోట్లు అని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నం. తెలంగాణలో ప్రతీ పౌరునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందేలా కార్యక్రమం రూపొందిస్తమని సీఎం చెప్పారు. కంటి వెలుగు తర్వాత ఈఎన్టి పరీక్షలు చేయిస్తమని అన్నారు. మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని హరీశ్ రావు అన్నారు. కూటమితో వచ్చేది లేదు పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీకి పోతది..టీడీపీకి వేస్తే అమరావతికి పోతదన్నారు. ఢిల్లీకి గులాం చేయడానికి, అమరావతికి సలాం చేయడానికో తెలంగాణ తెచ్చుకోలేదని అన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిదాంతం..రాహుల్ కన్ను కొట్టే సిద్దాంతమని ఎద్దేవా చేశారు. వచ్చే వానాకాలం నాటికి మెదక్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తమన్నారు. కరెంట్ కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో పద్మాదేవందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఎం సభకు భారీగా జనం హాజరయ్యారు.




