తెలంగాణ విషయంలో సోనియాపై నమ్మకం ఉంది

బలరాంనాయక్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో కచ్చితంగా ప్రకటిస్తారని కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. ఈ విషయంలో సోనియాపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అంతవరకు కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ తాను కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. త్వరలోనే ఆ ఎంపీలతో కలిసి ఈ విషయంపై మాట్లాడతానన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో తెలంగాణపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నారు.