తెలంగాణ సాధనకోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలి:నాగం

మంచిర్యాల: తెలంగాణ సాధన కోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలని తెలంగాణ నగర సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను గ్రామ బహిష్కరణ చేసి తరమికొట్టాలని అన్నారు. మంచిర్యాలలో నేడు నిర్వహించిన తెలంగాణ అసంఘటిత కార్మిక సమైక్య రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలకు 2014 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ వాదులందరూ కలిసి కట్టుగా ఉండి పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.