తెలంగాణ సాధన మా జన్మహక్కు: ఎంపీ పొన్నం
హైదరాబాద్, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు తాము విశ్రమంచబోమని ఆయన స్పష్టం చేశరు. అదే విధంగా మేం కాంగ్రెస్‌లో పుట్టాం, కాంగ్రెస్ పెరిగాం. పార్టీ గురించి కూడా పాటుపడతామన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించారు. వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. ఈ లోగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అంత వరకు వేచి చేడాల్సిందే అని అన్నారు. ప్రతి తెలంగాణ ప్రజా ప్రతినిధికి తెలంగాణ కావాలనే ఉన్నదని వ్యాఖ్యానించారు. త్వరలో తెలంగాణ ఎంపీలతో రాహుల్ గాంధీ కలవనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలిపారు.