తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీల పాత్ర కీలకం
టేకులపల్లి, సెప్టెంబర్ 17( జనం సాక్షి): సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులో తు రామ్ చందర్,,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విలీనం సభను సిపిఐ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామ్ చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని, ఆ పోరాటంలో కమ్యూనిస్టులు వారి పాత్ర కీలకమని అన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వారి పోరాటం ఆనాడు శూన్యమని చరిత్ర వక్రీకరించి ప్రభుత్వాలు ఉత్సవాలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సభ శనివారం జరిగింది. దొరలు, భూస్వాములు, పటేల్ ,పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీల దేనని లక్షలాది ఎకరాలు భూముల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించి సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలు ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఉందని, చరిత్రను వక్రీకరించి వివిధ రకాల పేర్లు పెట్టి చరిత్రను కనుమరుగు చేస్తే సమాజం ఒప్పుకోదని, 4500 మంది అమరవీరుల ఆత్మబలిదానమే నేటి తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో సిపిఐ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండి వారికోసం ప్రాణ త్యాగానికి, జైలు జీవితానికి వెనకాడలేదని తెలిపారు. ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి పంచిన ఘనత కమ్యూనిస్టుల పార్టీ దేనని ,ఇందులో ఏ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బలిదానంతో తెలంగాణ విలీనం జరిగిందని అన్నారు. హడాహుడిగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు హంగు ఆర్భాటాలు చేసి తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేయాలని చూస్తున్నార