తెలంగాలోకి మావో యాక్షన్‌ టీమ్‌లు?

అభ్యర్థులకు రక్షణపై ప్రధాన దృష్టి

ఖమ్మం,నవంబర్‌13(జ‌నంసాక్షి): దండకారణ్యంలోకి సాయుధ మావోల యాక్షన్‌ టీమ్‌లు ప్రవేశించాయన్న వార్త ఇప్పుడుకలకలం రేపుతోంది.దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే అభ్యర్థకలు రక్షణ కల్పించడం తొలిబాధ్యతగా తీసుకున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రరల్‌ జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్‌ టీమ్స్‌ కదలికలు ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ సమాచారమిచ్చింది. రాష్ట్ర సరిహద్దుల్లోని పలు పోలీస్‌స్టేషన్లకు కూడా హెచ్చరికలు జారీచేసింది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి యాక్షన్‌టీమ్స్‌కు సంబంధించిన పలువురు సభ్యుల వివరాలు రాబట్టడంతో పాటు వాళ్ల ఫోటోలు కూడా నిఘా విభాగం సేకరించింది. ఆ వివరాలను పంపించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలంటూ ఏజెన్సీ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేసింది. యాక్షన్‌ టీమ్‌ సభ్యుల ఆచూకీ చెప్పిన వాళ్లకు ఐదు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని పోలీసులు పోస్టర్లలో ప్రకటించారు. యాక్షన్‌ టీమ్స్‌ తెలంగాణలోకి ప్రవేశించాయని తెలియగానే సరిహద్దుల్లోని బలగాలు అప్రమత్తమయ్యాయి. వీళ్లంతా తెలంగాణలో పోలింగ్‌నే టా/-గ్గం/ట్‌గా చేసుకొని రంగంలోకి దిగారని అనుమానిస్తున్నాయి. దీంతో ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీచేస్తున్న వాళ్లకు పోలీసులు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే సమయంలో తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దని ఆదేశాలు కూడా

జారీచేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోనూ భయాందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం మావోయిస్టులకు ఎప్పిటినుంచో కంచుకోటగా ఉంది. ఈ రెండు రాష్టాల్లోన్రూ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలిదశలో ఛత్తీస్‌ఘడ్‌లో ఎలాంటి హింస లేకుండా నిర్వహించారు. 12వ తేదీన జరిగిన తొలి విడత పోలింగ్‌ ప్రధానంగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌, దంతెవాడ ప్రాంతంలో జరిగింది. ఆ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డేగకన్ను వేశాయి. తొలిదశలో బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలలోని 18 నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయ్యింది. మోహ్లా మాన్పూర్‌, అంతగఢ్‌, భానుప్రతాప్‌ పూర్‌, కాంకేర్‌, కేష్కాల్‌, కొండగాన్‌, నారాయణ్‌పూర్‌, దంతెవాడ, బీజాపూర్‌, కోంటా నియోజకవర్గాల్లో మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికల దృష్ట్యా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నిర్వహించారు. నెల 20వ తేదీన రెండోదశ పోలింగ్‌ జరగనుంది. అయితే ఆ దశలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తక్కువే. అందుకే బలగాల దృష్టి మొత్తం తొలివిడత పోలింగ్‌వైపే కేంద్రీకృతమైంది. మావోయిస్టుల హెచ్చరికల మధ్య కూడా ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత ఎన్నికల్లో 70శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో.. అజ్ఞాత దళాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ ముగిసింది. అక్కడ రెండోవిడత కూడా పూర్తయితే.. తెలంగాణలో వచ్చేనెల 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో పలు పరిణమాలు చోటుచేసుకున్నట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.