తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “గిడుగు రామ్మూర్తి” కి నివాళులు

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా, ‘సుందర తెలుంగు’ గా ప్రశంసలు పొందిన తెలుగు భాష కృషి విశేష సేవలు అందిన గిడుగు రాంమూర్తి జయంతి-తెలుగు భాషా దినోత్సవాన్ని సోమవారం శాఖా గ్రంథాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి గిడుగు రాంమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిడుగు రాంమ్మూర్తి తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని భాషా సంబంధమైన పరిశోధనలకే వెచ్చించారని అన్నారు.ఆయన స్పూర్తితో ప్రతీ ఒక్కరూ తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అవధాన ప్రక్రియ తెలుగు వారికే సొంతమని,తేనెలొలుకు తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ వైస్ చైర్మన్ పొలినేని స్వామి రాయుడు,గ్రంథాలయ ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి, పాఠకులు,గిడుగు అభిమానులు చేతరాసి వెంకన్న జంగ నాగరాజు,చోల్లేటి సోమేశ్,బుంగపట్ల ప్రభాకర్,బయ్యని మోహన్ రావు,సజ్జనం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.