తెల్ల కల్లు బట్టిని తొలగించాలని వినతి

జనంసాక్షి  బోథ్(అక్టోబర్ 08)
బోథ్ మండల కేంద్రంలోని
స్థానిక 7 వ బ్లాక్ పాత సినిమా థియేటర్ ప్రాంతంలో కొత్తగా తెల్లకల్లు  బట్టి పెట్టి జనావాసాల మధ్య విక్రయించడం వల్ల అక్కడే మద్యం తాగుతు కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రోజు వారి గొడవలు, బహిరంగ మూత్ర విసర్జన వంటి వాటి వల్ల రోగాల బారిన పడుతున్నామని యువకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక బోథ్ గ్రామపంచాయతీ కార్యాలయం యందు సర్పంచ్ సురేందర్ యాదవ్ గారికి యువకులు కల్లు బట్టిని తొలగించాలనీ వినతిపత్రం  అందజేశారు. ఇందుకుగాను సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సురేందర్ యాదవ్ గారు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా సంబంధిత ఎక్సయిస్ శాఖ వారి దృష్టి కీ తీసుకెళ్లి శాఖ పరమైన చర్యలు మరియు పై అధికారుల సహాయం తో అట్టి కల్లు బట్టి నీ తొలగించడం జరుగుతుందనీ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వీడీసి అధ్యక్షులు గంగాధర్, నాయకులు గోవర్ధన్, వార్డు సభ్యులు షేక్ షాకీర్, అపర్ణ రవి, పాలిక్ రమేష్, సాగర్, సాయి, అనిల్ తో పాటు పలువురు యువకులు  పాల్గొన్నారు.
Attachments area