తైవాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం
తైపే,జూన్4(జనంసాక్షి): తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షో అండ్ ఇంటరాక్ట్ విత్ మిస్టర్ కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తైవాన్ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల గురించి మంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి హావిూ ఇచ్చారు. రాష్టాన్రికి పెట్టుబడులు సాధించి పెట్టేందుకు గాను మంత్రి కేటీఆర్ గత రాత్రి తైవాన్ పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అంతకు ముందు పదిహేను రోజులు అమెరికాలో పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన చేపట్టారు.