తొమ్మిది నెలలు పింఛన్ అపిండ్రు..!
వితంతు పెన్షన్ కోసం బ్యాంకు చుట్టూ వృద్ధురాలు పడిగాపులు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో సెప్టెంబర్ 7.(జనం సాక్షి). అద్దే ఇంట్లో నివాసం సర్కార్ ఇచ్చే వితంతు పెన్షన్ ఆధారం. తొమ్మిది నెలలు బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్ బకాయి ఉందనే నేపంతో పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్దురాలు కన్నీరు మున్నీరు అవుతుంది.నెలల తరబడి బ్యాంకు చూట్టు తిరుగుతూనే ఉంది.తంగాల్లపల్లి మండలం గోపాలరావుపల్లే గ్రామానికి చెందిన పసుల లస్మవ్వ భర్త చనిపోవడంతో ప్రభుత్వం అందించే వితంతు పెన్షన్ ఆధారంగా జీవనం సాగీస్తోంది. ఇటీవల బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్ బకాయి ఉందని లోన్ చెల్లిస్తేనే పెన్షన్ ఇస్తామని తెలిపారని తొమ్మిది నెలల తిరుగుతున్న కనికరం చూపడం లేదంటువిలపిస్తుంది. గతంలో తీసుకున్న క్రాప్ లోన్ రుణమాఫీ కింద మాఫీ అయిందని అనుకున్నామని తీరా ఇప్పుడు బకాయి ఉందంటూ తనకు రావాల్సిందిన పేన్షన్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడతున్నరంటు వాపోతోంది. లస్మవ్వ బ్యాంకు అధికారులను అడిగితే ప్రభుత్వం కొత్త రుల్ తీసుకొచ్చిందని క్రాప్ లోన్ చెల్లించేంతవరకు పింఛన్ ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పడంతో అయోమయం లో ఉంది. ఉన్న ఊర్లో ఇల్లు కూలిపోవడంతో ప్రస్తుతంసిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో అద్దేయింట్లో నివాసం ఉంటు దినదిన గండంగా కాలం గడుపుతోంది. అధికారులు దయచేసి తనకు పింఛన్ అందేలా చూడాలని వేడుకుంటుంది. ఇటీవల పండుటాకులకు సంబంధించిన పింఛన్లు క్రాప్ లోన్ల పేరుతో నిలుపుదల చేసిన సందర్భాలు తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లే లో దళిత కుటుంబాలకు చెందిన వృద్ద మహిళల పింఛన్లు పాత బాకీల పేరుతో నిలుపుదల చేస్తున్నా ఘటనలు వరసగా చోటు చేసుకోవడం గమనార్హం.