తొలివికెట్ కోల్పోయిన భార‌త్‌..

          కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా తొలి వికెట్‌ చేజార్చుకొంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆరు బంతుల్లో 4 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. . విశ్వ ఫెర్నాండో వేసిన 1.3వ బంతిని ధావన్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా గాల్లోకి లేపాడు. ఫీల్డర్‌ పుష్ఫకుమార దానిని ఒడిసిపట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో పరుగులేమీ రాలేదు. ఈనేప‌ధ్యంలో 6 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి టీమిండియా 35/1తో ఉంది. కోహ్లీ (30), రోహిత్‌ (3) క్రీజులో ఉన్నారు.