తొలివిడత పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఏకగ్రీవాలపై నజర్ పెడుతామన్న ఇసి
సందడిగా సాగుతున్న ప్రచారాలు
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): తొలి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 21న తొలివిడత ఎన్నికలుజరుగనున్నాయి. అలాగే మలివిడతకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. పలుగ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాలు నమోదు చేసుకున్నాయి. గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతా పంచాయయితీ సర్పంచ్‌ల చుట్టే తిరుగుతోంది. ఎన్నికలకుపూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వివిధ జిల్లాలో పర్యటిస్తూ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సవిూక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. తొలి విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేలం ద్వారా పంచాయతీలను ఏకగ్రీవం చేయడం నేరమన్నారు. సంక్రాంతి సెలవుల్లో సైతం సిబ్బంది పనిచేయడం హర్షణీయమని కొనియాడారు. ఎంపీడీవోలు సర్పంచ్ ఎన్నికకు చేసే వ్యయాలను లెక్కిస్తారన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటా మన్నారు. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి గ్రామ సర్పంచిగా గుమ్ముల రవీందర్‌ను ఏక గ్రీవంగా ఏనుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ముజ్జిగూడెం, అప్పలనర్సింహ పురం, తిరుమలాపురం తండా, సుద్రేపల్లి పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తిరుమలాయపురం మండలంలో సోలిపురం పంచాయతీ ఏకగ్రీవం అయింది. మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో 4 పంచాయతీలైన గురజాల, ఆలంపల్లి, మురహరిదొడ్డి, ఐనాపూర్ ఏకగ్రీవం అయ్యాయి. మాగనూరు మండలంలో రెండు పంచాయతీలు ఉజ్జెల్లి, గురువావులింగంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ జిల్లా మామడ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం లింగాల మండలంలో 23 పంచాయతీలకుగాను 9 గ్రామపంచాయతీలు, 76 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవం అయిన వాటిలో అప్పపూర్, పద్మన్నపల్లి,చెన్నంపల్లి, మగ్దూంపూర్, బాకారం, మల్లోని చెరువుతాండ, కొత్తచెరువుతాండ, షూరాపూర్, శ్రీరంగాపూర్ పంచాయతీలు ఉన్నాయి. ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి సర్పంచిగా ఇంద్రసేనారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి తండాలో సర్పంచుగా నేనావత్ బుజ్జి సూర్యనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బైర్కాన్ పల్లి గ్రామసర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెంజర్ల గ్రామ సర్పంచుగా మామిడి వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలో 13 గ్రామపంచాయతీలు..కర్జెతరడా, శాపూర్, సెల్కాపురం, ఈర్ల తండా, అల్లమయిపల్లి, తిర్మలాయపల్లి, అంతాయిపల్లి, సురాయిపల్లి సహా మరిన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రామపురం పంచాయతీ ఏకగ్రీవం అయింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా పంచాయతీ ఏకగ్రీవం అయింది.