తొలివిడత ‘సహకారం’లో కాంగ్రెస్‌దే హవా

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): జిల్లాలో ఒకవైపు సహకార సంఘాలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సహకార సంఘాల తొలి విడత ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పార్టీలు తమ తమ మద్దతు దారులను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. జిల్లాలో సహకార ఎన్నికల్లో భాగంగా తొలి విడతగా జరిగిన 38 సహకార సంఘాలలో 25 సంఘాలను కాంగ్రెస్‌ పార్టీ చేయిజిక్కించుకోగా తెలుగుదేశం పార్టీ మూడు సంఘాలలో, టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు సంఘాలలో గెలుపొందగా బీజేపీ, వైకాపాలు ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నారు. మిగిలిన ఆరు సంఘాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌లోని  13 సంఘాలలో కాంగ్రెస్‌ 5, టీడీపీ 3 బీజేపీ ఒక సంఘంలో గెలుపొందగా నాలుగు సంఘాలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిర్మల్‌ డివిజన్‌లో 9 సంఘాలలో ఎన్నికలు జరగా కాంగ్రెస్‌కు 7, వైకాపాకు 1 గెలుపొందగా ఒక సంఘానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. మంచిర్యాల డివిజన్‌లో 16 సంఘాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అధ్యక్షులుగా గెలుపొందగా టీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లో గెలుపొందింది. తొలి విడత ఎన్నికలు పూర్తి కావడంతో సహకార బ్యాంక్‌ పదవిని కౌవసం చేసుకునేందుకు గెలుపొందిన అధ్యక్షులను శిబిరాలకు తరలించారు. రెండవ విడత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా మలి విడతగా 29 సంఘాలకు ఈ నెల 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సహయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.