‘తోటపల్లి’ రద్దుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన

4

– నేడు రాజీవ్‌ రహదారి దిగ్బంధనం

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌/కరీంనగర్‌,ఆగస్టు 11(జనంసాక్షి):

కరీంనగర్‌ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్‌ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ . సాగునీటి ప్రాజెక్టులను వివాదాస్పదం చేసి కేసీఆర్‌ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కేసీఆర్‌ సీఎంగా విఫలమయ్యరని, తోటపల్లి రిజర్వాయర్‌ రద్దును వ్యతిరేకిస్తూ బుధవారం తోటపల్లి దగ్గర ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. తోటపల్లి జలాశయం ప్రాజెక్టును ప్రభుత్వం రద్దుకు ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న భూ నిర్వాసితులతో చేపట్టనున్న గాగిళ్లాపూర్‌ రాజీవ్‌రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ప్రజాప్రతినిధులు పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆరెపెల్లి మోహన్‌, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నారని కార్యకర్తలు అధిక సంఖ్యలో

తరలిరావాలని పేర్కొన్నారు.  తెరాస ప్రభుత్వం 15 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హవిూలను నెరవేర్చటంలో విఫలమయిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యంజయం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమలు చేసిన తోటపల్లి ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల పథకం రద్దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అలా జరిగితే మన జిల్లాకు నీరు రావటం గగనం అవుతుందని తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇంతవరకు భూ పంపిణీ చేయలేదని, దీనిపై దళితులంత ఏకమై నిలదీయాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్‌ పార్టీ విూకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా నిరుపేదలకు రెండు పడకల ఇల్లు కట్టిస్తానని చెప్పిన ముఖ్యమంతి ఆ ఊసే లేదని, దీనిపై మహిళలు ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారులు నిబంధనలు పాటించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదిలావుంటే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి విమర్శలు అర్ధరహితమని శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జగన్‌కు నైతిక విలువలు లేవన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని ఆయన తీవ్రంగా విమర్శంచారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనపై దృష్టి పెట్టాలని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రవేశపెట్టిన ఆయా సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.