తోటి విద్యార్థినుల వేదింపుతో విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్: గోదావరిఖనిలోని ఐబీ కాలనీకి చెందిన గర్రెపెల్లి సుప్రియ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తోటి విద్యార్థినులు తరచు వేదింపులకు గురి చేయటంతో తీవ్ర మానసికవేదనకు గురై మంగవారం బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రి లక్ష్మయ్య సింగరేణిలో పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.