త్రివిధ దళాధిపతిగా నరవాణె
బాధ్యతలు స్వీకరించిన ఆర్మీ చీఫ్
న్యూఢల్లీి,డిసెంబర్16(జనం సాక్షి): భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణెళి అధికారికంగా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండవ అధిపతిగా జనరల్ ఎంఎం నరవణెళి నేడు బిపిన్ రావత్ వారసుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారికంగా ప్రకటించారు. డిసెంబరు 8న భారత వైమానిక
దళానికి చెందిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్ అయినందున జనరల్ నరవాణెళి కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని ఆర్మీ వర్గాలు చెప్పాయి. సీడీఎస్ ఛీఫ్‌గా బిపిన్ రావత్ ఉన్న సమయంలో త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్న ఎంఎం నరవణెళిను కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు విభాగాల్లో ఎంఎం నరవణెళి సీనియర్ అధికారి. దీంతో ఆయన్ని చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో త్రివిధ దళ సభ్యులుంటారు. సీడీఎస్ ఛీఫ్‌గా నియమితులైన ఎంఎం నరవణెళి వెల్ డిసిప్లిన్డ్ అధికారిగా పేరుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించడానికి ముందు, సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్లు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఉండేవారు.తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ , అతని భార్య మధులిక సహా 12మంది ఆర్మీ సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా బెంగళూరులోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే.