త్వరలోనే పెట్రో ధరల తగ్గుదల


వెల్లడిరచిన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి
న్యూఢల్లీి,అగస్టు25(జనంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయని మంగళవారం దిల్లీలో విలేకరుల సమావేశం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి తెలిపారు. పెట్రో ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాలపై సుంకాల పెంపును మంత్రి సమర్థించుకున్నారు. లీటరు పెట్రోల్‌పై ప్రభుత్వం రూ.32 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తుందని..తద్వారా సమకూరిన డబ్బును ఉచిత రేషన్‌, టీకా కార్యక్రమం, వివిధ సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తుందని వెల్లడిరచారు. 2010 ఏప్రిల్‌లో నాటి సర్కారు లీటరు పెట్రోల్‌పై రూ.32 సుంకం విధించేదని, ఇప్పుడూ అంతే మొత్తాన్ని తమ ప్రభుత్వం విధిస్తుందని హర్దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు.