త్వరలో గిరిజనబందు అమలు చేస్తాం

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి),
రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బందు అమలుచేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలో ని రైతు వేదికలో
ఆసరాపించన్ పాత లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను, సింగిల్ విండో ద్వారా మంజూరైన రుణాల చెక్కులను రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మల్యే మాట్లాడుతు
ముఖ్యమంత్రి కేసిఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. దళితుల కోసం దళిత బందు అమలు జరుగుతుందని అదేతరహాలో గిరిజనకోసం బందుపతకం త్వరలో అమలు చేయడానికి కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చి తండాల అబివృద్దికి కేసిర్ కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,సర్పంచుల ఫోరమ్ మండలాధ్యక్షులు తిరుమల్ రెడ్డి, ఎంపీడీఓ రాణి,తహసీల్దార్ దశరథ్ తదితరులున్నారు.