త్వరలో పనులు పూర్తి చేయాలి.
ఎంపీపీ పంధ్ర జై వంత్ రావు.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ కేంద్రం మండలంలోని నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పెందూర్ గూడా గ్రామంలో ఎంపీపీ నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన స్థానిక ఎంపీపీ ఆంధ్ర జై వంత్ రావు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వచ్చినా నిధుల్లో త్వరలో పనులు పూర్తి చేయాలని ఊర్లో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.అదేవిధంగా మన ఇంటి చుట్టూ మనమే శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి చక్రం సుమిత్ర బాయి భీమ్రావు టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సెడ్మాకి సీతారాం ఉప సర్పంచ్ గంగారాం జిపి సెక్రెటరీ గ్రామ పటేల్ దేవ్ షాప్ గ్రామదేవారి ఇశ్రు గ్రామస్తులు ఉన్నారు.