త్వరలో పశుగణన వివరాలుత్వరలో పశుగణన వివరాలు

జిల్లాలో పెరిగిన గొర్రెల సంఖ్య
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పశువుల వివరాలను ప్రకటించనున్నాయి. జనాభా లెక్కల మాదిరిగానే పశువుల గణన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 2012లో పశుగణనను నిర్వహించారు. 2017 లోనే నిర్వహించాల్సిన ఈ గణన ఆలస్యమైంది. గతంలో అధికారులు ప్రత్యేకంగా ప్రొఫార్మాను తయారు చేసుకొని మ్యానువల్‌లో పశువులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునే వా రు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ట్యాబ్‌లను అందజేశారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. పశువులు ఉ న్న రైతు ఆధార్‌ నెంబర్‌ను సైతం ఆన్‌లైన్‌ చేసుకొని పశువు ఫొటో తీసి అప్పటికప్పుడే జియో ట్యాగింగ్‌ను చేశారు. రైతుకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించిన పరికరాలను కూడా తెలుసుకొని ప్రత్యేక ప్రొఫార్మలో న మోదు చేసుకున్నారు. ఏప్రిల్‌లో అధికారులు గణనను పూర్తి చేసి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడానికి సిద్ధం చేస్తున్నా రు. వారం రోజులుగా పశువులు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, మత్స్యకారుల పరికరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించిన పశువుల గణనలో జిల్లాలో పశుసంపద పెరిగింది. ఆవులు, ఎద్దులు, తెల్లపశువులు 2012లో నిర్వహించిన గణనలో 2,73,408ఉండగా.. ప్రస్తుత సర్వేలో 3,08,017 ఉన్నట్లు  గణంకాలు చెబుతున్నాయి. అలాగే నల్ల పశువులు 2012లో 45,248 ఉండగా.. ప్రస్తుతం 47,633 ఉన్నట్లు గుర్తించారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం గొల్ల, కుర్మలకు రాయితీపై గొర్రెలు అందజేయడంతో జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మేకల సంఖ్య పెరిగింది.

తాజావార్తలు