త్వరలో విూ సేవ కేంద్రాలకు మంగళం

ఇక అన్ని పనులు గ్రామ సచివాలయంనుంచే ప్రారంభం
విజయనగరం,నవంబర్‌27( జనం సాక్షి ): త్వరలోనే విూ సేవా కేంద్రాలను ఎత్తివేస్తామని, ఇకపై అన్నీ పనులు గ్రామ సచివాలయంలోనే జరుగుతాయని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చెప్పారు. నియోజవర్గంలో ఉన్న రైతులందరికీ ఉచితంగా బోర్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అప్పలనర్సయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఈ పథకం కింద చెత్తను తరలించే రిక్షా బళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ.. తమ ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు వందకి 100 శాతం అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రైతు భరోసా పథకం అనేది నిరంతర పక్రియ అని వర్ణించారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులంతా వినియోగించుకోవాలని కోరారు.  విశాఖపట్నం తదితర ముఖ్య పట్టణాల్లో చంద్రబాబు నాయుడు అనుయాయులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారని విమర్శించారు. ్గ/ల్గ/లేరియా వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే భూముల రీ సర్వే ద్వారా ప్రతి రైతుకూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నా మన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీడీవో ఎంవి.బాలసుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసిపి మండల కన్వీనర్‌ కడుబండి రమేష్‌ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మంత్రి అప్పలనాయుడు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు గేదెల స్సింహద్రప్పలనాయుడు, మాజీ ఎంపీపీ రౌతు రాజేశ్వరి, దత్తిరాజేరు మాజీ సర్పంచ్‌ మహాదేవ ఫనీంద్రుడు, నాయకులు సుమల గోవింద్‌, బమ్మిడి అప్పలనాయుడు, సరితి అప్పలనాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.