థాయ్‌బజార్ వేలం ఆదాయం రూ.3.51లక్షలు
కాగజ్‌నగర్: మున్సిపాలిటీ పరిధిలోని థాయ్‌బజార్ వేలం సోమవారం నిర్వహించారు. ఆరుగురు గుత్తేదారులు పాల్గొనగా రూ.3.51లక్షల ఆదాయం వచ్చిందని కమిషనర్ రాజు తెలిపారు. ఈ వేలం పాటలో గుత్తేదారు షంషీర్ అలీ రైతు బజారును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జునస్వామి, రెవెన్యూ అధికారి అంజయ్య
తదితరులు పాల్గొన్నారు.