థీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి: చిరంజీవి

గుంటూరు: ధీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందరి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. గుంటూరు  జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ బుద్ధిజం ధీమ్‌ పార్కును గురువారం ఆయన సందర్శించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంకా అనేక ధీమ్‌ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భగా చిరంజీవి అన్నారు. తిరుపతిలో కూడా ధీమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తే మరింత పర్యాటక అభివృద్థి  జరిగే అవకాశం ఉందని, దీనికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపైన, అమరావతి, కొండవీడు, నాగార్జునుని కొండ తదితర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రితో చర్చిస్తానని తెలియజేశారు.