దంపతుల ఆత్మహత్య
మెదక్ జిల్లా : దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దినేష్ (25), అతని భార్య బేబీ (20) గత మూడు నెలలుగా నర్సాపూర్‌లోని శ్రీరాంసాగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం రావడంతో రాత్రి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నారు. దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దినేష్ స్థానికంగా ఓ పరిశ్రమంలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. బేబి గర్భ వితిగా ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.