దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా సమావేశం రద్దు

ప్యోంగ్యాంగ్‌, మే16(జ‌నం సాక్షి) : అణ్వాయుధాల నిరాకరణ, కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించే దిశగా దక్షిణ కొరియాతో సాగుతున్న సమావేశాలను రద్దు చేసినట్లు ఉత్తర కొరియా బుధవారం వెల్లడించింది. దీంతో వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల సమావేశంపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో అమెరికా సైనిక విన్యాసాలు చేస్తుండటంతో దక్షిణ కొరియాతో సమావేశాలను రద్దు చేసుకున్నట్లు ప్యోంగ్యాంగ్‌లోని స్థానిక విూడియా తెలిపింది. ఇటీవల కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకు సరిహద్దు గ్రామాల్లో అణ్వాయుధాల పరీక్షలు జరపకూడదని, సైనికులలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఇరు దేశాధినేతలు సమావేశంలో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం నుండి ప్రారంభమైన రెండు వారాల మాక్స్‌ డ్రిల్‌ లో నివేదిక ప్రకారం 100 యుద్ధ విమానాలు ఉపయోగించారని, దీంతో సరిహద్దు గ్రామంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని విూడియా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలలో యుఎస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, అణుసామర్థ్యం కలిగిన బి-52 యుద్ధ విమానాలు, ఎఫ్‌-22 ్గ/టైర్‌ జెట్లను వినియోగించారని తెలిపింది.