దత్తగిరి మహారాజ్ శత జయంతి కరపత్రం విడుదల
– ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే
ఝరాసంగం: అక్టోబర్ 2( జనం సాక్షి ) జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ దత్త గిరి మహారాజ్ యొక్క శత జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తో కలిసి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు విడుదల చేశారు. ఈ నెల 30 నుండి వంద రోజుల పాటు ప్రతిరోజు గోపూజ, అతిరుద్రం, రుద్ర సహిత దక్షయజ్ఞం, నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయమాత, బావి పీఠాధిపతులు సిద్దేశ్వరానంద గిరి మహారాజ్, నందిని గిరి మాత,మాజీ జెడ్పీటీసీ సభ్యులు పండరి నాథ్, కేతకి ఆలయ మాజీ చైర్మన్, వెంకటేశం, ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, బోయిని ఎల్లన్న, లక్ష్మారెడ్డి ఎం దత్తు, నాగన్న పాటిల్, భక్తులు పాల్గొన్నారు.