దమ్ముంటే లలిత్‌ను భారత్‌కు తీసుకురావాలి ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ సవాల్‌

y6aviv4bన్యూఢిల్లీ, ఆగస్టు 13 : విదేశాల్లో ఉన్న లలిత్‌మోదీని దమ్ముంటే భారత్‌కు తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. లలిత్‌గేట్‌పై చర్చించే ధైర్యం లేక మోదీ పారుపోతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వ్యాపం కుంభకోణంలో నిందితులను కాపాడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజు కూడా స్తంభింపచేసిన కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం రాహుల్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. సుష్మాస్వరాజ్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు.
మరికాసేపట్లో పార్లమెంటు విజయ్‌చౌక్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు సేవ్‌డెమొక్రసీ పేరుతో ఎన్డీయే ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్నారు. విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చూశారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేయనున్నారు. ఎన్డీయే, యూపీఏ పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.